బెట్టింగ్‌కు బానిసై యువకుడు ఆత్మహత్య

బెట్టింగ్‌కు బానిసై యువకుడు ఆత్మహత్య

కడప జిల్లాకు చెందిన అఖిల్ అనే వ్యక్తి, తెలంగాణలోని సంగారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. అఖిల్ ఓ లాడ్డిలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెట్టింగ్‌లో రూ.6 లక్షలు నష్టపోవడమే ఈ ఘటనకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. నిఖిల్ చనిపోయే ముందు తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.