జాతర ఇవాళ సాయంత్రం 7 వరకే..!
NGKL: లింగాల మండలం పరిధిలోని సలేశ్వరం పుణ్యక్షేత్రంలో 3 రోజుల పాటు జరిగిన లింగమయ్య స్వామి ఉత్సవాలు నేటితో ముగుస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారులు ఈరోజు సాయంత్రం 7:00 గంటల వరకు మాత్రమే అడవిలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రంతో ఈ ఏడాదికి జాతర అధికారికంగా ముగియనుంది. రేపటి నుంచి భక్తులకు లోపలికి ప్రవేశం ఉండదని తెలిపారు.