VIDEO: గ్రామ పాలన అధికారులకు పోస్టింగ్‌లు కేటాయింపు
NZB: జిల్లాలో గ్రామ పాలన అధికారులుగా నియామకం పొందిన జీపీవోలకు పోస్టింగ్‌లు కేటాయించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ నియామకాలను ఖరారు చేశారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.