మిరియాల టీ తాగుతున్నారా..?

మిరియాల టీ తాగుతున్నారా..?

టీలలో చాలా రకాలున్నాయి. చలికాలంలో అల్లం టీ, మిరియాల టీ ఎక్కువగా తాగుతుంటాం. టీలో మిరియాల పొడి కలుపుకుని తాగినా లేదా మిరియాల టీ తాగినా ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి. ఇందులో పైపెరిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. వాపును తగ్గిస్తుంది. షుగర్ నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.