కోనప్ప అంబలి పంపిణీని ప్రారంభం
ASF: కాగజ్ నగర్ బస్టాండ్‌లో ఉన్న సత్రం వద్ద మాజీ MLA కోనేరు కోనప్ప అంబలి పంపిణీని శనివారం ప్రారంభించారు. రెండు దశాబ్దాలుగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతోందని ఆయన తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా రాబోయే 2 నెలల పాటు ప్రతిరోజూ సుమారు 6,000 లీటర్ల అంబలిని ప్రయాణికులు, కార్మికులకు ఉచితంగా అందజేయనున్నారు. ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యమన్నారు.