జిల్లాలో ఉచిత కంప్యూటర్ కోచింగ్
BHPL: భూపాలపల్లి జిల్లాలో ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంప్యూటర్ కోచింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9848920828 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.