బైక్‌ను ఢీకొన్న ఆటో.. వ్యక్తికి గాయాలు

బైక్‌ను ఢీకొన్న ఆటో.. వ్యక్తికి గాయాలు

WNP: పెబ్బేరు మండలం కిష్టారెడ్డి పేటలో బైక్‌ను ఆటో ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పెబ్బేరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.