కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా అంతుకూరి శారద
BHPL: రేగొండ మండల కేంద్రంలోని దమ్మన్నపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచ సర్పంచ్ అభ్యర్థిగా అంతుకూరి శారదా సదానందం ఖరారయ్యారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆమెకు అభ్యర్థిత్వం ప్రకటించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు శారదా తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమె విజయం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.