మైదుకూరులో బండ్ల గణేష్ 'సంకల్ప యాత్ర'కు ఘన స్వాగతం
కడప: మైదుకూరుకు చేరుకున్న నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది. టీడీపీ నాయకులు బండి రెడ్డయ్య ఆయనను శాలువాతో సత్కరించి తేనీటి విందు ఏర్పాటు చేశారు. దేవుడి మొక్కు కోసం చేపట్టిన ఈ యాత్రలో ఇప్పటికి 350 కి.మీ పూర్తయిందని గణేష్ తెలిపారు. దారిపొడవునా జనం చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ, వచ్చే సోమవారానికి తిరుమల చేరుకుంటానని అన్నారు.