తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుదీప్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఉగాది సందర్భంగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు.