VIRAL: రోడ్డుపై బస్సులాగా.. ట్రాక్‌లపై రైలులాగా..
జపాన్‌లో ఓ వెహికల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది రోడ్డుపై బస్సులాగా, రైల్వే ట్రాక్‌లపై రైలులాగా ప్రయాణిస్తుంది. కన్నౌరా స్టేషన్లలోని ప్రయాణికులు ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను వీక్షించారు. దీనిని డ్యూయల్ మోడ్ వెహికల్ అని పిలుస్తున్నారు. ఇది ఒకేసారి 21 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.