'పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి'

'పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి'

NGKL: పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 14 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పీఎం శ్రీ స్కూల్స్ పథకం కింద జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న 22 యూనిట్ల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.