వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభం
JGL: పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నుంచి 4 రోజులపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శశి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీలో వార్డు సభ్యుల బాధ్యతలు, విధులు, గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యాచరణపై వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.