బాలుడి విక్రయం కలకలం.. తల్లితో సహా ముగ్గురి అరెస్ట్
NZB: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కన్నతల్లి తన బిడ్డను మహారాష్ట్రలోని పుణేలో రూ. 2.40 లక్షలకు విక్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎల్లమ్మగుట్టలో వెలుగుచూసిన ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. పోలీసులు తల్లితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ బాలుడి విక్రయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.