ట్రంప్ సుంకాలకు ముందే RBI అప్రమత్తం

ట్రంప్ సుంకాలకు ముందే RBI అప్రమత్తం

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే, సుంకాలు విధించడానికి ముందే US ట్రెజరీల కొనుగోళ్లను RBI క్రమంగా తగ్గించింది. బంగారం కొనుగోళ్లను పెంచింది. ఈ క్రమంలోనే యూఎస్ ట్రెజరీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశ ట్రెజరీల్లో భారత్ పెట్టుబడులు మేలో 235.3 బిలియన్ డాలర్లు ఉండగా.. జూన్‌లో 227.4 బిలియన్ డాలర్లకు పడిపోయాయని పేర్కొంది.