శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
KRNL: నందవరం (మం) గురజాల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఇవాళ దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ పరిసరాలను సందర్శించి, భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులతో కలిసి దేవస్థానాన్ని పరిశీలించి, గోపురాల నిర్మాణం, ముఖద్వారం నిర్మాణ పనులను పరిశిలించారు.