ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
KMM: ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీజ కల్లూరు, పెనుబల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాలను (CHC) సందర్శించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, సిబ్బంది హాజరు, మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.