ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి
KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందినట్లు అవుట్ పోస్ట్ ఏఎస్ఐ తెలిపారు. ఈనెల 22న అతను చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడన్నారు. మృతిడి వివరాలు ఆసుపత్రి రికార్డుల్లో లేవన్నారు. మృతుడి కుటుంబీకులు ఆసుపత్రిలోని ఔట్ పోస్ట్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.