పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీత
ATP: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలం నసనకోట పంచాయతీ కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆమె లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ప్రతి నెల పింఛన్ అందుతోందా? అని ఆరా తీశారు.