వీసాల రద్దు.. అధికారాల కోసం కెనడా ప్రయత్నాలు!

వీసాల రద్దు.. అధికారాల కోసం కెనడా ప్రయత్నాలు!

వీసా మోసాలను అరికట్టేందుకు కెనడా మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత్, బంగ్లా నుంచి వీసా మోసాలు పెరుగుతున్నాయన్న అనుమానాల నేపథ్యంలో వీసాలను రద్దు చేసే అధికారాల కోసం కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మోసపూరిత విజిటర్ వీసా దరఖాస్తులను గుర్తించి రద్దు చేయడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. ఈ మేరకు ప్రతిపాదిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.