ప్రారంభానికి సిద్ధంగా రాప్తాడు రైల్వే ఫ్లైఓవర్

ప్రారంభానికి సిద్ధంగా రాప్తాడు రైల్వే ఫ్లైఓవర్

ATP: రాప్తాడు ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ పనులు పూర్తి కావడంతో ఈ నెల 15న ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన ఈ పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవతో వేగంగా పూర్తి చేయించారు. రైల్వే గేటు సమస్య తీరనుండటంతో ప్రయాణికులు, విద్యార్థులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.