ప్రభుత్వానికి సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరిక

ప్రభుత్వానికి సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరిక

AP: అనంతపురం పాపంపేటలో భూ ఆక్రమణలపై నిర్వహించిన సభలో CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. చరిత్రలో లేని విధంగా ఒక ఊరినే కబ్జా చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు, మంత్రులే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కబ్జాదారులకు అధికారులు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. 15 రోజుల్లో పాపంపేట సమస్యను పరిష్కరించాలని.. లేదంటే CM కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.