'మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్'
MLG: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో అమలవుతున్న మాస్టర్ ప్లాన్‌తో మరో పదేళ్ల వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభిప్రాయపడ్డారు. ఈసారి జాతరలో పది వేల మందికిపైగా పోలీసులు పనిచేస్తారని తెలిపారు. ట్రాఫిక్, క్రౌడ్, క్రైమ్ కంట్రోల్ కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తామన్నారు.