శ్రీ విద్యాలక్ష్మి గణపతికి పందిరి రాట

E.G: కడియం మండలం కడియపులంక గ్రామదేవత శ్రీ ముసలమ్మ అమ్మవారి ఆలయంలో కొలువైయున్న శ్రీ విద్యాలక్ష్మి గణపతి స్వామి వారికి గణపతి నవరాత్రులు శుభ సందర్భంగా ఆదివారం పందిరి రాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విద్యాలక్ష్మి గణపతి స్వామి వారికి బియ్యంతో ఇరుముడిని కట్టి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు.