రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ ధ్యేయం : వీరేశం

NLG: రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ MLA వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగగూర్ మండలం అయిటిపాముల రిజర్వాయర్ డీ49 నుండి నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేశారు. NKL, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లో వ్యవసాయాకి నీరందించేందుకు రిజర్వాయర్ నుంచి 200 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.