ఓటు వేసిన నటుడు తనికెళ్ల భరణి
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా నటుడు తనికెళ్ల భరణి తన సతీమణితో కలిసి యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశారు. ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు ఉండదన్నారు. యువత బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ శాతం పెంచాలని కోరారు.