జిల్లాలో 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

ప్రకాశం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఖాళీల ఆధారంగా 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాకు పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ దామోదర్ బుధవారం ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారిని తన కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ..పోలీస్ శాఖలో మరింత నిబద్ధత కలిగి విధులు నిర్వర్తించాలన్నారు.