వడ్యాలెండా సర్పంచ్‌గా రాజేష్ ఏకగ్రీవం

వడ్యాలెండా సర్పంచ్‌గా రాజేష్ ఏకగ్రీవం

NRML: లక్ష్మణ చాంద మండలంలోని వడ్యాలెండా గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. గ్రామానికి చెందిన మలావత్ రాజేష్‌ సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు శనివారం గ్రామం నుంచి రాజేష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో కూడా తొలిసారి గ్రామపంచాయతీగా ఏర్పడిన ఈ గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకున్నారు.