VIDEO: శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు
WNP: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి దుద్దిళ్ల శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్‌లో శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ శాసనసభ స్పీకర్‌గా ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు.