రోడ్డు ప్రమాదాల నివారణకు పతిష్ట చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు పతిష్ట చర్యలు

SRPT: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం ఎస్పీ నరసింహతో కలిసి జాతీయ రహదారి 65పై ఖమ్మం క్రాస్ రోడ్, జనగామ క్రాస్ రోడ్ తదితర 'బ్లాక్ స్పాట్స్'ను ఆయన పరిశీలించారు. ఇంజనీరింగ్ లోపాలను సవరించాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు, లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.