ఇందిరమ్మ క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి
HYD: బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇవాళ ఇందిరమ్మ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి, విద్య, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులకు తక్కువ ధరకే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడం ఈ క్యాంటీన్ లక్ష్యం అన్నారు.