ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడు మృతి.
W.G. భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన తాళ్లూరు శామ్యూల్ రాజు (21) ఆగి ఉన్న లారీని ఢీకొని మృతి చెందాడు. దీనిపై ఏఎస్సై సత్యనారాయణ మృతుడి తాత ప్రభుదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.