సర్పంచ్ ఏకగ్రీవం..ఆలయాభివృద్ధికి రూ.15.50 లక్షల నిధులు
NRPT: ఊట్కూర్ మండలంలో ఎన్నికల వేడి మొదలైంది. మూడో విడత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు ముందుగానే ఏకగ్రీవ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిడుగుర్తి గ్రామ ప్రజలు రాములును సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. గ్రామంలోని గుట్టపై ఉన్న ఆలయ అభివృద్ధి కోసం రాబోయే సర్పంచ్ అభ్యర్థి రూ.15.50 లక్షలు అందించేందుకు ఒప్పందం చేసుకున్నారు.