రేపు శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవం
VZM: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాన్ని విజయనగరం స్టేడియం కాలనీ సమీపంలోని ఓం మందిరంలో రేపు ఉ. 9 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందరు హాజరు కావాలని డిఆర్‌వో కోరారు.