అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఐసీడీఎస్ ఆర్జేడీ

ELR: నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీలో ఉన్న ఏఎంతోట అంగన్వాడీ కేంద్రాన్ని, మీర్జాపురంలోని అంగన్వాడీ కేంద్రం -1ను ఐసీడీఎస్ ఆర్జేడీ సుజాత సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మెనూ ప్రకారం తయారు చేసిన ఆహారాన్ని పరిశీలించారు. పిల్లలను బరువు తూచి రికార్డుల్లో నమోదు చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.