ఉత్తర కొరియా హ్యాకర్ల పంజా

ఉత్తర కొరియా హ్యాకర్ల పంజా

ఉత్తర కొరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు వేలాది అమెరికా కంపెనీలు ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ప్యాకేజీని హ్యాక్ చేశారు. దీనిని గుర్తించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన అకౌంట్‌ను తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకునేవరకు ఈ సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి నుంచి అమెరికా కంపెనీలు కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.