'జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల రాజీకి ప్రయత్నం చేయండి'
W.G: డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ క్రిమినల్ కేసుల రాజీకి ప్రయత్నం చేయాలని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి లక్ష్మీ నారాయణ అన్నారు. సోమవరం భీమవరంలో పోలీసు అధికారులతో న్యాయమూర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీకి అవకాశమున్న కేసులను కోర్టు దృష్టిలో పెట్టాలని, కేసుల విషయాల్లో ఇబ్బందులు వుంటే సంబంధిత మేజిస్ట్రేట్లకు తెలియజేయాలన్నారు.