KU షెడ్యూల్ విడుదల .. అయోమయంలో విద్యార్థులు
KMM: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్ష తేదీలను ఇవాళ ప్రకటించింది. ఈనెల 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే ఐదో సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ (ఓల్డ్) పరీక్షను పోరపాటుగా 15.12.2028గా ప్రకటించడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్ష రాయాలంటే మూడు సంవత్సరాలు వేచి చూడాలా? అంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.