ఎమ్మెల్యే దానంకు మహిళలు ఫిర్యాదు

HYD: ఫిలింనగర్‌లో యువత గంజాయి తాగుతూ చెడిపోతున్నారని ఈ విషయాన్ని పలుమార్లు పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని దీన్ దయాల్ నగర్ మహిళలు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఫిలింనగర్ సీఐకి ఫోన్ చేశారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తనకు మహిళలు ఫిర్యాదు చేస్తున్నారని సీఐ దృష్టికి తీసుకువచ్చారు.