'ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'
BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ నామినేషన్ కేంద్రాన్ని చిట్యాల సీఐ మల్లేశ్ ఇవాళ సందర్శించారు. మౌలిక వసతులు, ఏర్పాట్లను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.