కార్యకర్త కుటుంబానికి అండగా జనసేన

కార్యకర్త కుటుంబానికి అండగా జనసేన

AP: గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన సభ్యుడు రంగప్ప కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. రాయదుర్గం ఇంఛార్జ్ మంజునాథ్ గౌడ్ నేతృత్వంలో పార్టీ నాయకులు రంగప్ప నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జనసేన పార్టీ తరపున రూ. 5 లక్షల బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమ కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా కల్పించారని పేర్కొన్నారు.