'ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి'
SRPT: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని, మరణించిన వారి పేర్లను తొలగించి అర్హులకు ఓటు హక్కు కల్పించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను కూడా తక్షణమే పరిష్కరించాలని సూచించారు.