మున్సిపల్ కార్పోరేషన్ కాంప్లెక్స్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
EG: రాజమండ్రిలోని కంబాల చెరువు వద్ద ఉన్న మున్సిపల్ కార్పోరేషన్ కాంప్లెక్స్ మరమ్మత్తు పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు అభివృద్ధి పనులకు రూ.45 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాల మేరకు నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తుందన్నారు.