డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కమిషనర్
KKD: కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన సంజయ్ నగర్‌లోని డంపింగ్ యార్డును కమిషనర్ సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. అక్కడ తయారు చేసిన సేంద్రియ ఎరువును తక్షణమే తరలించాలని, తద్వారా చెత్త వేయడానికి వెసులుబాటు కలుగుతుందని అన్నారు. ఇక్కడ తయారవుతున్న సేంద్రియ ఎరువు గురించి హెల్త్ ఆఫీసర్ పృథ్వీరాజ్ వివరించారు.