VIDEO: నదిలో పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
TPT: నాయుడుపేట-వెంకటగిరి మార్గంలోని స్వర్ణముఖి నదిలో మద్యం మత్తులో ఒక వ్యక్తి పడిపోయాడు. హుటాహుటిన స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబీ బృందం రక్షణ చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యు లు తెలిపారు. వేగంగా స్పందించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.