దేశీయ విత్తనాల పునరుత్పత్తికి సహకరించాలి

VSP: ఆరోగ్యకరమైన పంటల కోసం దేశీయ విత్తనాల పునరుత్పత్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం కోరారు. విశాఖలోని ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన శిక్షణ, విత్తనాల ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. మొత్తం 130 రకాల దేశీయ కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను ప్రదర్శించినట్లు తెలిపారు.