విజయవాడ బస్ స్టాండ్‌లో బొమ్మ పడబోతోంది..!

విజయవాడ బస్ స్టాండ్‌లో బొమ్మ పడబోతోంది..!

NTR: విజయవాడ బస్టాండ్‌లోని రెండు మినీ థియేటర్లు సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకోనున్నాయి. ఇటీవల రూ.2.5 లక్షలకు టెండర్లు దక్కించుకోవడంతో ప్రస్తుతం రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు లేదా డిసెంబర్ తొలి వారంలో సినిమా ప్రదర్శనలు ప్రారంభిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెండు థియేటర్లలో కలిపి 200 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి.