కాలువలో వ్యక్తి మృత్యదేహం లభ్యం

ఏలూరు: నగరం 1వ పట్టణ పరిధి వంగయ్య గూడెం సెంటర్ హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మురుగు కాలువలో పడి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అటుగా వెళుతున్న స్థానిక సదరు మృతదేహాన్ని గుర్తించారు. కాగా, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక హత్య చేశారా అనే కోణం ఉంది. మృతి చెందిన వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వాడు, ఎవరు అనే పూర్తి వివరాలు తెలియాలి.