నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు
కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామం లో రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10.30 కు రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి అపార్ట్మెంట్స్ వద్ద రోడ్లు శంకుస్థాపన లో పాల్గొంటారు. ఉదయం 11.30 కు కె.గంగవరం మండలం దంగేరు నందు రోడ్లు శంకుస్థాపన లో పాల్గొంటారు.