రేపు లింగాలకు మంత్రి సవిత రాక

రేపు లింగాలకు మంత్రి సవిత రాక

KDP: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత సోమవారం లింగాల మండలంలో పర్యటించనున్నట్లు పులివెందుల టీడీపీ కార్యాలయ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ సందర్భంగా పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవితో కలసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా లింగాల మండలంలో పర్యటిస్తారని, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.